జనం న్యూస్, నవంబర్ 08 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి)
కొత్తగూడెం ప్రాంతంలో నివసించిన జనగామ సాయమ్మ దశదినకర్మల కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ ప్రాంతం నుండి దాదాపు 50 సంవత్సరాల క్రితం కొత్తగూడెంకు వలసవచ్చిన సాయమ్మ కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారు.తన ఇద్దరు కుమారులు, కూతురును వివాహం చేసి కుటుంబ శ్రేయస్సు కోసం జీవితమంతా శ్రమించిన సాయమ్మను జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆమె సేవలను స్మరించారు.ఈ సందర్భంలో జాతీయ బీసీ సంఘం నాయకులు కురిమెల్ల శంకర్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్, టి.బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు శేషాద్రి వినోద్, మాదాసు మల్లయ్య, నరసయ్య, ముత్యాల ప్రభాకర్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ — “సాయమ్మ నిస్వార్థంగా కుటుంబం కోసం కృషి చేసిన ధీర మహిళ. ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయమని” అన్నారు.


