Listen to this article

కోదాడ నవంబర్ 08

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఈ దంపతులు, ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకున్నన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.