

సబ్ టైటిల్ .రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి కన్వీనర్ నారాయణ
బీసీడీ నుంచి బిసిఏ గ్రూపులో చేర్చే వరకు పోరాడుదాం
ఏకతాటిపై నిలబడి ముదిరాజుల హక్కుల కోసం పోరాడుదాం
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)
ఈనెల 5న నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల మహాసభను విజయవంతం చేయాలని ముదిరాజు సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్ నారాయణ పిలుపునిచ్చారు. గురువారం హత్నూర మండలం బోరపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముదిరాజు ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ముదిరాజుల కులస్తులందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నిలబడి మన హక్కుల కోసం పోరాడాలని కోరారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లో చేర్చే వరకు ఐక్యమత్యంతో పోరాడాలన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని సాయి కృష్ణ గార్డెన్లో ఈనెల 5న నిర్వహిస్తున్న ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో. ముదిరాజ్ నాయకులు ఆంజనేయులు, కృష్ణ, సంతోష్, రాజేందర్, ఆ గమయ్య, నరేందర,రవికుమార్, కిష్టయ్య. నాగేష్. తదితరులు పాల్గొన్నారు.