Listen to this article

జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం లో.పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ ఆ లీడర్ పై ఏ చర్యలు తీసుకుంటారా ఇటీవల కేడి దొడ్డి మండలం పాగుంట వెంకన్న జాతరలో అధికారులు అక్రమ వసూలు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకున్న సంగతి మరువకముందే తాజాగా..గట్టు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీఅంభభవాని జాతర్లో ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ గలీజ్ దందాకు తెరలేపారు‌. జాతర్లో వెలసిన చిరు వ్యాపారుల నుంచి పెద్ద మొత్తం వసూళ్లకు పాల్పడటంతో చిరువ్యాపారుస్తులు బోరుమంటున్నారు‌. ఒక్కో దుకాణం నుంచి వేలలో వసూళ్లు చేయడం గమన్హారం‌‌. ఇది ఇలా ఉండగా.‌. అధికారులను మేనేజ్ చేస్తా అని చెప్పుకోవడం విశేషం. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు మరి పొలిటికల్ లీడర్ పై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు గట్టు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.