Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో సర్వేయర్లు అవకతవకలకు పాల్పడ్డారని శాయంపేట గ్రామస్తులు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు విదేశాలలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఇండ్లు కట్టుకుని ఉన్న వారికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినవారికి లబ్ది చేకూర్చేలా సర్వే నిర్వహించారని ఆరోపించారు అలాగే రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన భూమి ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో కొందరి పేర్లు లేక పోవడంతో అధికారులు అవకతవకలకు పలు పడినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇకనైనా సర్వేను మళ్లీ నిర్వహించాలి మండల గ్రామ ప్రజలు కోరుతున్నారు….