Listen to this article

ప్రత్యేక అభిషేకాలు, రుద్రహోమం – మహా అన్నదానం

జనం న్యూస్ నవంబర్ 11 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది.తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, మృత్యుంజయ సహిత శ్రీ రుద్రహోమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
తదుపరి ఆలయ ప్రాంగణంలోని అన్నదాన సత్రంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు ఆలయ మండపంలో దీపాలను వెలిగిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.