Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 12-11-2025 అనగా బుధవారం చేపట్టబోయే మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్య మం ర్యాలీ పోస్టర్లు ను నందలూరు మండల కేంద్రం నందు వైసీపీ నాయకులు విడుదల చేశారు.ఈ సందర్బంగా వైసీపీ నాయ కులు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు ప్రతిభ ఉన్న పేద మధ్య తరగతి విద్యార్థులకు మరియు పేద ప్రజలకు వైద్య విద్య మరియు ఉచిత వైద్యం అందుబాటులో ఉండాలని భావితరాల భవిష్యత్ కు పునాదులు వేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించార ని కానీకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీపీ అనే విధానంతో కాలేజీలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయం తీసుకొని పేదలు మరియు మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా రాజంపేట పట్టణం నందు నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం ర్యాలీ కార్యక్రమంలో వైసీపీ పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛం దంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిళ్ళ త్రీనాద్ యాదవ్, గుండు మల్లికార్జున రెడ్డి సీనియర్ నాయకులు అజీజ్,సుబ్బరామిరెడ్డి, నరసింహ రెడ్డి,పాటూరు నరసింహ రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,సోమిశెట్టి ప్రభాకర్, పాటూరు మోహన్ రెడ్డి,నాగ సుబ్బయ్య, విజేయుడు, గుణ యాదవ్, భాస్కర్ యాదవ్, ఇబ్బు భాయ్, మధు యాదవ్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, గంగినాయుడు, కాకి చంద్ర, మోడ పోతుల సుధాకర్, ముమ్మడిశెట్టి సుధాకర్, మహబూబ్ బాషా,పనతల గంగయ్య, మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి, వాణిశ్రీ,లక్ష్మీదేవి, దేవి,తదితరులు పాల్గొన్నారు.