Listen to this article

జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

జీవీఎంసీ 84వ వార్డులో మంగళవారం ఉదయం11 గంటలకు కొత్తూరు రాజుపాలెం రోడ్డు లో ఉన్న వార్డు ఆఫీస్ దగ్గర మహా విశాఖ నగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాలు మేరకు జీవీఎంసీ అనకాపల్లి జోన్- 7 జోనల్ కమీషనర్ ఆధ్వర్యంలో 80,84 వార్డు విలీన గ్రామాలలో పీహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కు 80 వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమ,భాస్కర్,84 వార్డు మాధంశెట్టి చినతల్లి,నీలబాబు,సాలాపు మోహన్,కసిరెడ్డి సత్యనారాయణ,చేబోలు దుర్గాప్రసాద్,చూచికొండ రమణ,చేతుల మీదుగా యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సానిటరీ ఇన్స్పెక్టర్ CH మాణిక్యాలరావు,24 వ సచివాలయం,కొప్పాక సానిటరీ సెక్రటరీ గీతా 25 వ సచివాలయం శిరసపల్లి KNR పేట సానిటరీ సెక్రటరీ సూర్య ప్రకాష్ 26వ సచివాలయం వల్లూరు సానిటరీ సెక్రటరీ రాజు,27వ సచివాలయం సాలపు వానిపాలెం సానిటరీ సెక్రటరీ గణేష్ తదితరులు పాలుగోన్నారు.