జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐ పి యస్ ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రతి ఫిర్యాదు పై తక్షణమే స్పందించి చట్ట ప్రకారం పరిష్కరించే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి యస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు డి. ఎస్పీ, సర్కిల్ అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ జిల్లా లోని పలు ప్రాంతాల నుండి వచ్చిన 10 అర్జీలను జిల్లా ఎస్పీ స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులతో పాటు పోలీస్ స్టేషన్ ల యస్ యచ్చ్ ఓ లకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి ప్రజా సమస్యలకు సిబ్బందిని కేటాయించి త్వరితగతిన సమస్యల పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు.ప్రజా పిర్యాదుల పై ఎలాంటి అలసత్వం చూపకూడదని, ఆయా కేసులలో చేసిన పురోగతి ని బాధితులకు తెలియజేయాలనీ అన్నారు.ఈ రోజు వచ్చిన పిర్యాదులలో భూ వివాదాలకు సంబంధించి -03,
గొడవలకు సంబంధించి -02,అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని-01 ఇతర అంశాలకు సంబంధించి 04 పిర్యాదులు రావడం జరిగింది…


