Listen to this article

( జనం న్యూస్ నవంబర్ 11 ఓబులవారిపల్లి )

ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు మరియు ఓబులవారిపల్లి రైతు సేవా కేంద్రం ఆకేపాటి వెంకట రెడ్డి పొలంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం లో భాగంగా అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ మాట్లాడుతూ రైతులందరు నవధాన్యాలు 32 రకాల విత్తనాలు భూమిలో చల్లినచో భూమి బాగా గుల్లబారుతుంది ప్రధాన పంటకు మొక్కకు బలపరుస్తుంది ఎరువులు పంట సమయం లో తగినంత వాడాలి రైతు సేవ కేంద్రం లో ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సహాయ వ్యవసాయ సంచాలకులు మణి మాట్లాడుతూ పంట పొలాలకు సబ్సిడీ తో సోలార్ గురించి ఆలోచన జరుగుతున్నదని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి బి మల్లిక మాట్లాడుతూ రైతులందరు ఏక పంట వద్దు అంతర పంటలు ముద్దు మినుము,అలసంద,నువ్వులు,మొక్కజొన్న,సజ్జ,రాగులు మొదలైన పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇవ్వడం జరిగినది. మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీరాములు మాట్లాడుతూ ఎరువులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యుదయ రైతు Dr.జి వెంకట్రామ రాజు మాట్లాడుతూ ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని దీని ద్వారా పంటలకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది దీనితో పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇవ్వవచ్చునని తెలిపారు అంతె కాకుండా అన్నమయ్య జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ఇవ్వడం జరిగిందని అనేక విషయాలు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ ఏ హరి కృష్ణ RSK సిబ్బంది APCNF సిబ్బంది రైతులు పాల్గొన్నారు.