

కార్మికులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కంపెనీ యాజమాన్యం
అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మా సమస్యలు పరిష్కరించాలని బయటకు వచ్చి చెబుదామనుకుంటే కంపెనీ యాజమాన్యం మెయిన్ గేట్ వరకు రాకుండా అడ్డుకుంటున్నారని కంపెనీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నో ఏళ్ళుగా కంపెనీలో పనిచేస్తున్న కనీస వేతనాలు అమలు చేయడం లేదని తక్షణమే జీతాలు పెంచాలని, ఆదివారంతో పాటు పబ్లిక్ హాలిడేస్ లో కూడా కంపెనీకి సెలవులు ఇవ్వకుండా కంపెనీలో పని చేయిస్తున్నారని
గతంలో పిల్లలకు స్కాలర్షిప్లు,బ్యాగులు వైద్య ఖర్చులు చెల్లించేవారని ఇప్పుడు అవేమి అమలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.