జనంన్యూస్. 11.నిజామాబాదు. సిరికొండ.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి గ్రామం లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూంపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంస పత్రాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు విద్య,వైద్యం అలాగే అనేక సామాజిక సేవ కార్యక్రమాల పట్ల వీరు చేస్తున్న సేవలు మరువలేని అని పౌండేషన్ సభ్యులని కొనియాడారు.
అనంతరం పౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ మాట్లాడుతూ మనం ఏ పరిస్థితిలో ఉన్న మనల్ని ఉన్నత స్థానంలో ఉంచే ఏకైక ఆయుధం విద్య ఒకటేనని, విద్యార్థులు గొప్ప చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు. ప్రధానోపాధ్యాయులు శంకర్ ,వి డి సి చైర్మన్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ దేవరాజు, ఫౌండేషన్ సభ్యులు వినోద్,ప్రశాంత్,రాజేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


