Listen to this article

జనం న్యూస్ నవంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

శ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉదయం కార్తీక్ మాసం సందర్భంగా రిటైర్డ్ లెక్చరర్ ఎం ఆర్ జి కుమార్జి సూర్యనారాయణ దంపతులు చలి తీవ్రతను గమనించి పేద వాళ్లకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఆలోచనతో స్వామివారికి పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్న అనంతరం 20 మంది పేదలకు సూర్యనారాయణ కుమార్జి కలిసి దుప్పట్లో పంపిణీ చేశారని చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు దూలం సత్యవతి ఎలమంచిలి బంగారు రాజు భక్తులు కాండ్రేగుల శివ కాండ్రేగుల వెంకట సూరి దేవస్థాన గుమస్తా మల్ల రామ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.//