Listen to this article

జనం న్యూస్ నవంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో నిరుద్యోగులకు పండగే పండుగ రాబోతుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కృషి ఫలితంగా అనకాపల్లి విశాఖ జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా పరిశ్రమలు రావడంతో నిరుద్యోగ యువతీ యువకులకు మూడు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు మాజీ ముఖ్యమంత్రి విధ్వంసకారుడు జగన్ రెడ్డి నా కృషివల్లే వచ్చిన పరిశ్రమలు చంద్రబాబు తెచ్చినట్లుగా నాకు రావలసిన క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని జగన్ రెడ్డి చెప్పడం దెయ్యాల వేదాల వల్లించిన చందంగా ఉందని నాగ జగదీష్ వ్యాఖ్యానించారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం సాధించిన ఫలితాలను జగన్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని, హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, అనంతపురం జిల్లాలో కియో పరిశ్రమ రావడానికి మహామేత . వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి లెటర్ రాయడం వల్లే వచ్చిందని, ఆదానీ డేటా సెంటర్ 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో 500 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసుకున్నారని, దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో డేటా సెంటర్ కి కేటాయించిన భూములను 123 ఎకరాలకు కుదించి ఎటువంటి ఏర్పాటు చేయలేకపోయారని, ప్రసిద్ధి చెందిన గూగుల్ డేటా సెంటర్ కూడా మా హయాంలోనే సంప్రదింపులు చేశామని జగన్ రెడ్డి చెప్పడం పై నాగ జగదీష్ ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాలలో అమరాన్ బ్యాటరీస్ పదివేల కోట్లు పెట్టుబడులను రాష్ట్రానికి రాకుండా తరిమివేశారని, కియా మోటార్స్ అనుబంద సంస్థలు తమిళనాడుకు తరలిపోయాయని, అనంతపురం జిల్లా రాప్తాడు జాకీ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నది మీరే కదా అని నాగ జగదీష్ ప్రశ్నించారు. గత 17 నెలల నుండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పండగలను సైతం లెక్కచేయకుండా దేశ విదేశాల్లో పర్యటించి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం చేసిన కృషి ఫలితంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందని, ఈనెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సమ్మెట కు 44 దేశాల నుండి పెట్టుబడిదారులు వస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు అనుమతులు స్పీడ్ అప్ డూయింగ్ నినాదంతో ముందుకు దూసుకుపోవడంతో పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం చంద్రబాబు నాయుడు విజన్, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలకు పెట్టుబడుదారులు ముందుకు వస్తున్నారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు పొలిమేర నాయుడు పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ యాదవ సంఘం నాయకులు సారిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.