Listen to this article

బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రోడ్డుపై సోయా కొనుగోలుపై ఎలాంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు.సోయ కొనుగోలుపై రోజు కో నిబంధన పెట్టి రైతులకు ఇబ్బంది గురిచేస్తున్న ప్రభుత్వం. అకాల వర్షం కారణంగా సోయలో డ్యామేజ్ అండ్ మట్టి రేణువులు రావడం వల్ల మార్క్ఫైడ్ సిబ్బంది రోజుకో మాటలు మాట్లాడి రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నారు.గత ప్రభుత్వం ఎకరానికి సోయ 10 క్వింటాళ్లు కొనుగోలు చేసేది ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాళ్లు 50 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తుంది.
బిచ్కుంద రైతు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటను ఆరబెట్టి తేమ శాతం వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు చూసి తూకం వేసిన తర్వాత తూకం వేసిన బస్తాలని కొనుగోలు కేంద్రంలో నిలిపి (reject ) వేస్తున్నారు.ఈరోజు రైతులు అందరూ ఆగ్రహించి రోడ్డు మీదికి వచ్చి సోయా కొనుగోలుపై ఎలాంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు.రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నారని తెలుసుకున్న రెవిన్యూ ఆర్ ఐ రవీందర్, ఎస్ఐ మోహన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా రాస్తారోకో విరమించారు.