(జనం న్యూస్ 12నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కాజిపల్లి మరికొన్ని గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనం కొత్తగా నిర్మిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా అసంపూర్తిగా నిలుపుదల చేయడంతో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి, భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమయ్యే పంచాయతీ భవనాన్ని నిర్మించకుండా నిధుల కొరతతో నిలుపుదల చేసి అసంపూర్తిగా వదిలేయడం పాలకులు మరియు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు


