Listen to this article

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి*”
జనం న్యూస్ 10కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.ఆసిఫాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకి యూత్ డిక్లరేషన్ పేరుతో ఐదు హామీలను ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ద్వారా నియమకాలు చేపడతామని నిరుద్యోగ భృతి 4000 అందిస్తామని అన్నారు ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన చేస్తున్నది దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.పది సంవత్సరాల నుండి నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచాలనే ప్రతిపాదన ఉప సంహరించుకోవాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని డివైఎఫ్ఐ కొమురం భీం జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గెడం టికనంద్ కార్యదర్శి గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు