Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //1//జమ్మికుంట //కుమార్ యాదవ్..

̤ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పద్మశ్రీ అవార్డులలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం, సామాజిక ఉద్యమాలలో సుదీర్ఘ పోరాటం చేసి హక్కులు సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎంపిక కావడం పట్ల మహిళా డప్పు కల మండలి కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి డప్పు చప్పుళ్ల మధ్య దరువు వేస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేస్తూ మందకృష్ణ మాదిగ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మహిళ డప్పు కళామండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి, భవానీ మాట్లాడుతూ..అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారుఅదేవిధంగా ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల మహా కళా ప్రదర్శనకు ఇంటికొక్క డప్పు ఊరి కొక్క బస్సు చొప్పున వేలాదిగా కరీంనగర్ జిల్లా నుండి డప్పు కళాకారులు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ కళామండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) కళా మండలి జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోయిని కొమురయ్య,
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు
బూత్కురి కాంత మాదిగ,
మహిళ గౌరవ అధ్యక్షురాలు,
మహిళా డప్పు కళాకారుల సంఘం జిల్లా సలహా దారులు బొద్దుల వాణి,అవారు లత పటేల్
బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారప్రతినిదిడప్పు రాధా మాదిగ మహిళ డప్పు కళామండలి జిల్లా ఉపాధ్యక్షులుచల్లురి లక్ష్మీ మాదిగ మహిళ డప్పు కళామండలి నాయకురాలు కుంటాల మౌనిక,మాదిగ బృందంతుంగ జనేయులు, మాదిగ ఎమ్మార్పీఎస్.̤జిల్లాఅధికారప్రతినిదిదండు అంజయ్య మాదిగ కవి రచయిత చిట్యాల విజేందర్,జిల్లాకార్యదర్శిజీడిమోహన్.̤గసికంటికుమార్.̤మాదిగసముద్రాల అజయ్ మాదిగ గోసికి శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.