

ప్రతి భక్తునిచే లిఖింపజేయడమే రామకోటి సంస్థ లక్ష్యం
-భక్తిరత్న జాతీయ అవార్డ గ్రహీత రామకోటి రామరాజు
జనం న్యూస్, ఫిబ్రవరి 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భగవన్నామమే శాశ్వతమని నమ్మిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వారు గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నాడు గజ్వేల్ లోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హరిహర లిఖిత మహాయజ్ఞం నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రామనామ స్మరణ చేయించి రామ, శివ నామాలను లిఖింపజెయించారు. అక్కడే లిఖించి రామకోటి రామరాజుకు అందజేశారు.అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ శాశ్వతమైనది నీడలా వెంట ఉండేది భగన్నామం ఒకటే అన్నారు. త్వరలో శృంగేరి పీఠంకు అందజేస్తామన్నారు.ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మికం వైపు తీసుకొస్తున్న రామకోటి రామరాజును, కమిటీ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిద్ది బిక్షపతి, ఎర్రం శ్రీనివాస్, దూబకుంట మెట్రాములు, నంగునూరి సత్యనారాయణ, జగ్గయ్యగారి శేఖర్, మర్యాల భద్రప్ప, శ్రీనివాస్, లచ్చలు, వెంకటేశం, ప్రశాంత్, శంకర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.