Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయిం చడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యా రంగంలో విశ్వ మానవతా మార్పులు చోటు చేసు కుంటున్నాయనిఅన్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ విద్యార్థు లకు ఉన్నత విద్యా అవ కాశాలు కల్పించడంయువతకుఉద్యోగావకాశాలు, ఉపాధి ఆకాంక్షాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ,పిఎం విఖ్యాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ, ఇమాము లకు రూ.10,000, మౌజను లకు రూ.5,000 గౌరవ వేతనం,హజ్ యాత్రి కులకు ఒకొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం వంటి పథ కాలు ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూర దృష్టి ఫలితంగా మైనార్టీ సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పఠాన్ మెహర్ ఖాన్ తెలిపారు.ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రివర్యులు లోకేష్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.