జనం న్యూస్ నవంబర్ 12 కోదాడ
తెలంగాణ బ్రాండ్ మినరల్ మిక్సర్ తెలామిన్ పశు పోషకులకు వరం అని సూర్యాపేట జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కోదాడ పశు వైద్యశాలలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు పశుపోషకుల కోసం తయారుచేసిన తెలామిన్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలామిన్ పశువుల ఆరోగ్యం మెరుగుపరిచి అధిక పాలడిగుబడితో పశు పోషకులకు లాభసాటి ఈ మిశ్రమాన్ని అన్నారు. ఈ మిశ్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.


