జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు .రామచంద్రారెడ్డి డీకే అరుణమ్మ 2లక్షల ఎకరాల కోసం డిజైన్ చేసి సింహ భాగం పూర్తి చేస్తే ప్రస్తుత నాయకుల నిర్లక్ష్యం వలన ఇప్పటి వరకు మిగతా పూర్తి చేయలేదు 99 బి సి డి మరియు 100 ప్యాకేజీ దశబ్దాలనుండి పెడింగ్ తాటికుంట రిజర్వాయర్ నుండి బింగిదొడ్డి చెరువుకి వెంటనే లింక్ కాలుపాలి.మల్లమ్మ కుంట రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలి
నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని రిజర్వాయర్స్ పూర్తి స్థాయి లో నింపాలి అయిజ 13-11-2025 జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం నెట్టెంపాడు 99 మరియు 100 ప్యాకేజీల ద్వారా 56వేల ఎకరాలకు నీళ్లు అందాల్సింది. గత ప్రభుత్వం గానీ ఇప్పుడు నటువంటి ప్రభుత్వం గానీ నిర్లక్ష్యం వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు కూడా రావడం లేదు ఉదాహరణకు 99 బి సి డి పనులు పూర్తయితే దాని ద్వారా 100 ప్యాకేజీకి నీళ్ళు వచ్చి 56 వేల ఎకరాలకు అల్లంపూర్ నియోజకవర్గం రైతులకు నీళ్ళు అందుతాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రైతుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఈ యొక్క వ్యవహారం చాలా దారుణంగా ఉంది వెంటనే 99 నటువంటి బిసిడి పనులు పూర్తి చేయాలని అదేవిధంగా 100 ప్యాకేజ్ కి నీళ్ళు అందించి అల్లంపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు బింగిదొడ్డి చెరువుకి గతంలో పలుమార్లు తాటికుంట నుంచి రిజర్వాయర్ నుంచి బింగిదొడ్డి చెరువుకు నీళ్లు అందించాలని ఆందోళన చేయడం జరిగింది కానీ ఇంతవరకు కనీస ప్రణాళిక సిద్ధం చేయలేదు వెంటనే తాటికుంట రిజర్వాయర్ నుండి చెరువుకు కాలువ పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలని బింగిదొడ్డి చెరువుకు నీళ్లు అందిస్తే రబిపంట పండుతుంది అని దానితోపాటు అయిజ పట్టణంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అదేవిదంగా తుమ్మిళ్ల లిఫ్ట్ సంబందించిన మల్లమ్మ కుంట రిజర్వాయర్ వేంటనే పూర్తిచేయాలని.అదేవిధంగా నెట్టెంపాడు కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు ర్యాలంపాడు రిజర్వాయర్లు 4 టీఎంసీలు నింపాలని ఎన్నో సందర్భాల్లో పోరాటం చేయడం జరిగింది . మా నాయకురాలు డీకే అరుణమ్మ ఉన్నప్పుడు 4 టిఎంసిలు నీళ్లు వచ్చేవి స్థానికంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల దానికి గండిపడి కేవలం 2 టీఎంసీలకే పరిమితమైంది వెంటనే దాన్ని నాలుగు టీఎంసీలు రిపేర్ చేసి నింపాలని, దానితోపాటు తాటికుంట రిజర్వాయర్ సంబంధించి 1.45 టీఎంసీలు అందాల్సింది కానీ కేవలం 0.7 మాత్రమే ఉన్నాయి ముచోనిపల్లి 1.5 టి యం సి గాను 1 టీఎంసీ అందుతున్నాయి నాగర్ దొడ్డి 0.69 అందాల్సింది 0.5 మాత్రమే అందుతుంది అని ఈ రకంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద రెండు లక్షల ఎకరాలు నీళ్ల అందాల్సింది లక్ష ఏకాలరాలు కూడా అందే పరిస్థితి లేదు ముఖ్యంగా అల్లంపూర్ నియోజకవర్గం రైతులకు మాత్రం చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది వెంటనే దీనిపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించే విధంగా చూడాలని లేని పక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసి నీళ్లు అందే వరకు రైతుల పక్షన భారతీయ జనతా పార్టీ ఉంటుందని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మేడికొండ భీమ్ సేన్ రావు మండలం & పట్టణం అధ్యక్షులు గోపాలకృష్ణ, కంపాటి భగత్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రతీప్ స్వామి ఉప అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, చిన్న శంకరయ్య, వీరేష్ గౌడ్ తదితరులు పాలుగోన్నారు.


