Listen to this article

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్టీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తన కుమార్తెసిరమ్మ మరియు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పాల్గొన్నారు..చిన్న శ్రీను మాట్లాడుతూ..ప్రజా వైద్యం , ప్రజల హక్కు అనే నినాదంతో గత కొంతకాలంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణలో భాగంగా, ప్రతి నియోజకవర్గానికి 50వేల సంతకాల చొప్పున సేకరించే కార్యక్రమం చేపట్టింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో 8500 కోట్లు ఖర్చుతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి , అందులో ఏడింటిని పూర్తి చేసి , ఐదు కాలేజీలను ప్రారంభించడం జరిగింది , మిగతా 10 కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో పూర్తి కావాల్సి ఉంది అయితే కూటమి ప్రభుత్వం , ఈ 17 నెలల కాలంలో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసి , ఏడాదికి 1000 కోట్ల చొప్పున , ఐదేళ్లలో 5వేల కోట్లు ఖర్చు చేసి 10 మెడికల్ కాలేజీ లను పూర్తి చేయడం భారంగా భావిస్తూ , వీటిని ప్రైవేటుపరం చేయడానికి ముందుకు వెళుతుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రానికి వైద్య సీట్లను కేటాయిస్తే … మాకు వద్దు అని కూటమి ప్రభుత్వం చెప్పడం అత్యంత దౌర్భాగ్యకరం విద్య , వైద్యం ప్రజలకు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకి ఉందని బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పారు దానికి అనుగుణంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్య , వైద్యాన్ని పేదలకు అందించడానికి ఎంతో కృషి చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ , వీటిని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ ప్రజలకు విద్య ,వైద్యాన్ని దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది ఈ కార్యక్రమంలో.. భీమిలి నియోజకవర్గం ఎస్. ఇ. సి మెంబర్లు, రాష్ట్ర కార్యదర్శిలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా మరియు మండల పార్టీ కమిటీలలో వివిధ హోదాలో గల సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు,మరియు పెద్ద ఎత్తున్న ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.