జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చీపురుపల్లిలో శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా ర్యాలీను అడ్డుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు.
పోలీసులు రాజకీయ నాయకులు కాదని… వారు ప్రజల కోసం, చట్టాల రక్షణ కోసం పనిచేయాలన్నారు. పేద విద్యార్థుల కోసమే ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు.ఇలాంటి సంస్కృతి జిల్లాలో ఎప్పుడూ లేదని… పోలీస్ అధికారులు ఆలోచించాలన్నారు.


