

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2025 తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
గద్వాల:గద్వాల నియోజకవర్గంలో గుర్తు తెలియని కేటుగాళ్లు వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ గ్రూప్ లోకి కేటుగాళ్ళు ప్రవేశించి నేను పలానా పోలీసు సీఐని నన్ను గ్రూప్ అడ్మిన్ ఇవ్వమని రేక్వెస్ట్ పెట్టి..గ్రూప్ చాట్ లో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం శుక్రవారం బయట పండింది.మోసగాళ్లు మొదట వాట్సాప్ గ్రూప్ లోకి ప్రవేశించేందుకు గ్రూప్ అడ్మిన్ కు రిక్వెస్ట్ పెడుతాడు. గ్రూప్ లో నమోదు కాగానే నేను పోలీసు సీఐని నాకు గ్రూప్ అడ్మిన్ ఇవ్వమని చాలా పద్దతి గా చెపుతారు. సరే నిజమే పోలీస్ అనుకొని గ్రూప్ కి అడ్మిన్ చేయగానే.. కేటుగాడు తన పని తాను చేసుకుంటున్నాడు. గ్రూప్ మొత్తం తన చేతులోకి తీసుకొని అంతకుముందు గ్రూప్ అడ్మిన్ లను తొలగించి వాట్సప్ గ్రూప్ మొత్తం తనే యజమానిగా ఉండేటట్టు తయారు చేసుకుంటాడు. గ్రూప్ లో పేద వారికి హర్ష సాయి ట్రస్ట్ తరుపున ఆఫర్ అంటూ..2000 చెల్లిస్తే 18500 రూపాయలు వెంటనే చెల్లిస్తామంటూ గ్రూప్ లో పోస్ట్ పెడుతారు. వారే 2000 చెల్లించినట్లు 18500 పలాన వ్యక్తికి డిపాజిట్ ఐనట్టు స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో సెండ్ చేస్తారు. ఇలాంటి సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. గద్వాల నియోజకవర్గం కొన్ని గ్రూప్ లోకి అనుచిత వ్యక్తి రెక్వెస్ట్ పెట్టి..నేను పోలీసు సీఐ ని అని నాకు గ్రూప్ అడ్మిన్ ఇవ్వండని నమ్మబలికాడు. నిజమే పోలీసు అనుకొని గ్రూప్ అడ్మిన్ ఇవ్వగానే అంతకు ముందు గ్రూప్ అడ్మిన్ లను తొలగించి గ్రూప్ మొత్తం తన చేతుల్లోకి తీసుకొని వాట్స్ అప్ గ్రూప్ లో మోసాలకు తెగబడ్డాడు. ఇది తప్పు అలా ఎలా ఇస్తారు అన్న వారిని గ్రూప్ నుంచి తీసివేసి నేను పోలీస్ సీఐని నాకు డబ్బులు వచ్చాయి ఇప్పుడే అంటూ.. నమ్మండి అని గ్రూప్ లో పోస్ట్ సెండ్ చేస్తాడు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్ళు. ఈ విషయాన్ని పత్రిక విలేకరులు గమనించి సదరు వ్యక్తికి ఫోన్ చేయగా.. అందుబాటులోకి రావడం లేదు. వెంటనే అన్ని గ్రూప్ లోని ప్రజలను అప్రమత్తం చేసి,సదరు వ్యక్తి చెపుతున్న మాటలు నమ్మబాకండి అని ప్రజలను అలర్ట్ చేసింది. ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్దమయ్యారు.
దయచేసి ప్రజలు ఒకటి గమనించండి ఎవరు ఊరికే అమౌంట్ ఇవ్వరు మనము పగలంతా పనిచేసే రాత్రికి మనమే సుఖపడలేము ఎవరు ఫ్రీగా అమౌంట్ ఇవ్వరు దయచేసి ప్రజలు నమ్మొద్దండి ఆశ దోశ ఎరగదు మనం మోసపోయేది గ్యారెంటీ ఇందులో ప్రజెంట్ నేను కూడా మోసపోయాను దయచేసి ఎవరు మోసపోవద్దండి ఇది అంతా ఒక ఫ్రాడ్ అయినా ఇలాంటి అవుట్ ని పోలీసులు పట్టించుకోవడమే లేదు ఆయన ఎందుకో ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు దయచేసి ప్రజలు ఒకటి గమనించండి ఎవరికి ఎవరు ఫ్రీగా ఇవ్వరు మనము కష్టపడితేనే మన సుఖపడుతాము కష్టంతో వచ్చింది అది ఏది ఫ్రీగా వద్దు తీసుకోవద్దండి