

జనం న్యూస్. 1ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా :, డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
జైనూర్ :నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నామని జైనూర్ సీఐ రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు అదేశాల మేరకు జైనూర్ మండల కేంద్రంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ.. జైనూర్ మండల కేంద్రంలోని పలు కాలనిల్లోని ఇంటింటికి తనిఖీలు చేపట్టగా, సరైన ధ్రువపత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్డెన్ సెర్చ్ లో జిల్లాలోని ఇద్దరు సీఐలు, 6 మంది ఎస్సైలతోపాటు 67 మంది సిబ్బందితో తనిఖీలు చేశామన్నారు.
