Listen to this article

సురక్ష హాస్పిటల్ డా తిరుపతి, స్వర్ణలత,కి ప్రత్యేక కృతజ్ఞతలు..

జనం న్యూస్ // ఫిబ్రవరి //1// జమ్మికుంట// కుమార్ యాదవ్..

శనివారం రోజున జమ్మికుంట పట్టణం 15వ వార్డు కేశవపురం లో పాతకాల ప్రవీణ్, ఆధ్వర్యంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ తిరుపతి, మరియు డాక్టర్ స్వర్ణలత, యొక్క సహకారం తో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరాన్ని వార్డు ప్రజలందరూ భారీ ఎత్తున వినియోగించుకోవడం జరిగింది.ఈ సందర్బంగా పతకాల ప్రవీణ్ మాట్లాడుతూ…చాలా వరకు ఆరోగ్య సమస్యలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, వస్తున్నయి అన్నారు. ముక్యంగా బీపీ, షుగర్ లాంటి ఎన్నో జబ్బుల తో బాధపడుతున్నారన్నారు.. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఇంకా ఎన్నో పెట్టాలి అని, సురక్ష మల్టీస్పెషల్ డాక్టర్ ను కోరడం జరిగిందని తెలిపారు. ప్రతి పేదవారికి, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల వల్ల, కాస్త ఉపశమనం ఉంటుందని వివరించారు. గ్రామ పెద్దలు, మరియు గ్రామ ప్రజలు, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎంతోమంది విద్యార్థులకు, అతి తక్కువ ఖర్చుతో, పేదవారికి సేవలందిస్తున్న,సురక్ష హాస్పిటల్ డాక్టర్ కె తిరుపతి మరియు స్వర్ణలత కి కృతజ్ఞతలు తెలిపారు.