జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఈ రోజు భీమిలి నియోజకవర్గం , పద్మనాభం మండలంలోని మద్ది గ్రామంలో నిర్వహించే శ్రీశ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రధమ వార్షికోత్సవం ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ పెద్దలు సిరమ్మకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం శ్రీశ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి పీఠం నకు వచ్చిన పరమాత్మ నంద గిరి స్వామి, శ్రావణ చైతన్య నంద స్వామీ జీల అశ్వీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ శ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారు వార్షికోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. సాగర దుర్గా అమ్మవారు కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆమె ప్రార్థించారు. సాగర దుర్గా అమ్మ వారు మహిమ గల తల్లి అని కొనియాడారు.తదనంతరం అక్కడ నిర్వహించిన అన్నప్రసాదం కార్యక్రమం లో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం వితరణ గావించారు.ఈ కార్యక్రమంలో పద్మనాభం ఎం.పీ.పి. కoటుభుక్త రాంబాబు, మద్ది సర్పంచ్ బుగత సత్యనారాయణ, ఆనందపురం మండల పార్టీ ప్రతినిధి మరియు వై యస్సార్ సీపీ సీనియర్ నాయకులు మజ్జి వెంకట రావు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


