జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నా, ఫార్మసీ రంగం మాత్రం టెక్నాలజీతో కలిపి మరింత విస్తృత అవకాశాలను అందిస్తోందని జేఎన్టీయూ వీ.సీ ప్రొఫెసర్ సుబ్బారావు అన్నారు. గురువారం స్థానిక జే.ఏన్.టీ.యు ల ఫార్మసిటికల్ సైన్స్ విభాగంలో బీ-ఫార్మసీ కోర్సును ప్రారంభించారు.టౌషధ శాస్త్రం సమాజానికి అత్యవసరమైన రంగమని, దేశ విదేశాల్లో ఫార్మసీకి విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.


