జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
సికింద్రాబాద్ రైల్వే నిలయంలో అన్నమయ్య జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంలో రాచూరి మురళి నందలూరు రైల్వే స్టేషన్ కు సంబధించిన పలు ముఖ్యమైన అంశాలను చర్చించారు.ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మరియు చెన్నై–ముంబై ట్రైన్ లను నందలూరు లో నిలుపుదల చేయవలసినదిగా కోరడ మైనది.అలాగే నందలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చెయ్యేరు నది ఉండటం వలన అక్కడ శుభ్రమైన నీరు అన్ని కాలాల్లో లభ్యమవు తోందని, అందువలన ట్రైన్లకు వాటరింగ్ సదు పాయం నందలూరులో ఏర్పాటు చేయాలని కోరారు.రైల్వేకు చెందిన వందల ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉందని,ఆ భూమిని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఆర్ ఎల్,డి,ఏ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని సూచించారు.అలాగే రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు,వృద్ధులు మరియు మండల ప్రజలు హైదరాబాద్, చెన్నై వైపు రైలు మార్గంలో ప్రయాణించేందుకు ఎదుర్కొంటున్నబ్బందులనువివరించి,శబరి యాత్రికుల కోసం నందలూరులో ప్రత్యేక ట్రైన్ స్టాపేజీ ఇవ్వాలని కూడా అభ్యర్థించారు.దీనికి స్పందించిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్
త్వరలోనే ట్రైన్ స్టాపేజీలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని,శబరి స్పెషల్ ట్రైన్‌ల రెండవ విడత స్టాపేజీల జాబితాలో నందలూరు పేరు తప్పక పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.మిగిలిన రైల్వే అభివృద్ధి అంశాలు కూడా అత్యున్నత అధికారుల సమగ్ర కమిటీ సమావేశంలో పరి గణలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.


