

జనం న్యూస్ ఫిబ్రవరి 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా పోలీసు విభాగంలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు మరియు విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్,ఎల్.మోహన రావు పదవీ విరమణ పొందిన సిసిఎస్ అనకాపల్లి ఎస్సై వి.వి.ఎస్. ప్రసాద్, వి.మాడుగుల పి.ఎస్ ఏఎస్సై జె.వి.ఆర్.ఎస్. సుబ్బరాజు, ఏ.ఆర్.ఎస్సైఎన్.రాజబాబు, బుచ్చయ్యపేట పి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు (వాలంటరీ రిటైర్మెంట్) మరియు తేది: 08.08.1987 మీ న చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్ వద్ద మావోయిస్టుల మందుపాతర పేలుడు ఘటనలో వీరమరణం పొందిన ఏ.ఆర్.పి.సి కీర్తిశేషులు వై.సురేంద్ర రావు సతీమణి పద్మావతికి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో అంకితభావంతో విశేష సేవలు అందించారని ప్రశంసించారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించడంతోపాటు, ప్రజలకు అహర్నిశలు సేవలు అందించారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం సేవ చేయడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు.పదవీ విరమణ పొందిన అధికారులు సుమారు 35 సంవత్సరాలకు పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మరియు అనకాపల్లి జిల్లాలలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, పోలీస్ శాఖకు విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, ఏదైనా సహాయం అవసరమైనప్పుడు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఏ.ఓ శ్రీ రామ కుమార్, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, బాల సూర్యరావు, లక్ష్మి, రామకృష్ణారావు, మన్మధరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.//