Listen to this article

జనం న్యూస్ నవంబర్ 13

చిల్డ్రన్ డే సందర్భంగా గురువారం నాడు un గోవిందపూర్ లోని అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీకి స్థానిక విద్యా భారతి స్కూల్ నుండి 400 విద్యార్థులు సందర్శించారు. ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు తయారు విధానం, వర్క్ షాప్, ఆడిటోరియం, ఆహ్లాదకర వాతావరణం చూసి పిల్లలు చాలా సంతోషించారు. కంపెనీ స్టాఫ్ పిల్లలకు గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహించారు. విద్యార్థులు ఆటలలో పాల్గొని బహుమతులను గెలుపొందినారని, ఈ సందర్శన వల్ల పిల్లలలో స్ఫూర్తి, విజ్ఞానం, మంచి ఆలోచనలు పెరుగుతాయని ప్రిన్సిపాల్ టి. కృష్ణారెడ్డి తెలిపారు.