జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అయిజ పట్టణంలో శుక్రవారం నాడు మార్కెట్ యార్డ్ (గంజ్) నందు మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరతో రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఐజ పట్టణంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.
క్వింటాలుకు ₹:2400/-మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రైతులు కొనుగోలు కేంద్రానికి సరకు తో వచ్చే సమయంలో పట్టాదారు పాసుబుక్కు,బ్యాంకు పాస్ బుక్కు ,ఆధార్ జిరాక్స్ కాపీలు మరియు వ్యవసాయ అధికారి పంటసాగు ధ్రువీకరణ పత్రాలను విధిగా తీసుకురావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయిజ, మల్దకల్, గట్టు మండలాల రైతులు ఈ కొనుగోలు సెంటర్ ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ను ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. రైతులు సకాలంలో మొక్కజొన్నను బాగా ఆరబెట్టుకుని కచరా లేకుండా నాణ్యమైన పంటను తీసుకొచ్చి సెంటర్లో అమ్ముకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


