జనం న్యూస్ నవంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కాట్రపల్లి గ్రామంలోని సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ జూన్ చెరియన్ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ అభివృద్ధికి పునాదులు అని అందరు మీ హక్కుగా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరును చదువు నేర్పిన గురువులకు పాఠశాలకు మంచి పేరును తేవాలని, భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించడం జరిగింది. అనంతరం ర్యాలీ నిర్వహించడం పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు నాయక్, రాజన్న, జెస్విన్, బిజయ్, ప్రవళిక, శైలజ, మౌన్యా, శృతి, ఉమ, లిబి, లింగు నాయక్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


