జనం న్యూస్, నవంబర్ 14,అచ్యుతాపురం:
అంగన్వాడి సెంటర్లకు ప్రీస్కూల్ పిల్లలతో బలోపేతం చేసి,అంగన్వాడి సెంటర్లో ప్రభుత్వ పాఠశాల విలీనం ఆపాలని ఈరోజు దిబ్బపాలెం సచివాలయం వద్ద నిరసన తెలిపి సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం అందజేయడం జరిగిందని సీఐటీయూ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ చేసి మూడు నుంచి ఆరు సంవత్సరాలు లోపు పిల్లలను అంగన్వాడి సెంటర్లో ఉండే విధంగా జీవో ఇవ్వాలని, ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేసి యూనిఫామ్, టై,బూట్లు, ఇవ్వాలని, అలాగే మెనూ పెంచి ఆన్లైన్ పనులు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు వరలక్ష్మి,అరుణ, ఆర్ రాము,కే సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు.


