జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గం నవంబర్ 14వ తేదీ శుక్రవారం నాడు నందలూరు మండలంలో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (డబ్ల్యూ హెచ్ ఆర్సీ) ఆధ్వర్యంలో MJPAPBCWR స్కూల్ & జూనియర్ కాలేజ్ (గర్ల్స్) మరియు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ లో కార్యక్రమాలు వరుసగా నిర్వ హించబడ్డాయి.పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకు వస్తూమెడల్స్, మోమెంటోస్, సర్టిఫికేట్స్ ప్రదానం చేసి విద్యార్థినులనుసత్కరించారు.అతిథుల ప్రసంగాలు విద్యార్థులలో కొత్త ఉత్సాహం నింపాయి. ఈ కార్య క్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షు రాలు సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి. వారికి విద్యతో పాటు స్ఫూర్తి, ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం సమాజం యొక్క బాధ్యత అని తెలిపారు.అలాగే, డబ్ల్యూ హెచ్ ఆర్సీ చేపడుతున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్య, భద్రత పై సంస్థ కట్టుబాటును వివరించారు.డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కూడా ఇరువురు స్కూల్స్‌లో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ“పిల్లల విద్యలో పెట్టిన ప్రతి నిమిషం, ప్రతి రూపాయి దేశ భవిష్యత్తుకు పెట్టుబడి. వారి హక్కులను రక్షించే బాధ్యత మనందరిదే అని పేర్కొన్నారు.డబ్ల్యూ హెచ్ ఆర్సీ టీమ్ మరియుస్కూల్ నిర్వాహకుల పాత్ర ప్రశంసనీయంఈ కార్య క్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీజుల్ఫికర్ ,రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రెటరీ రవితేజ పాల్గొని విద్యార్థి నులను అభినందించారు.ఇరువురు స్కూల్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యా యులు,తల్లి దండ్రులు విద్యార్థినుల సహకారంతో వేడుకలు ఆహ్లాడ
కరంగా జరిగాయి. పిల్లలే రేపటి భారత నిర్మాతలు వారి కలలకు రెక్కలు ఇవ్వడం డబ్ల్యూ హెచ్ ఆర్సీ ధ్యేయం అని తెలిపారు.



