జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం నియోజకవర్గం
కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుండి సద్గురు కోలా తిరుపతయ్య శ్రీమతి అప్పలనరసమాంబ వారి ఆశీస్సులతో వారి కుమారులు మీరయ్య ఆధ్వర్యంలో భక్తులు శుక్రవారం అన్నవరం పాదయాత్రకు బయలుదేరారు. సుమారు 2000 మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు మహిళలు కూడా భక్తిశ్రద్ధలతో భజనలు చేసుకుంటూ పాదయాత్ర చేశారు. భక్తిశ్రద్ధలతో ప్రతి సంవత్సరం అన్నవరం దేవస్థానం కి వెళ్లిమొక్కులు తీర్చుకుంటామని భక్తులు పేర్కొన్నారు. వీరికి మార్గ మధ్యలో భక్తులు అవసరమైన ఏర్పాట్లను చేస్తుంటారు.



