Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

స్వాతంత్ర్యం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల, పేద ప్రజల పక్షమేనని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండిరమేష్ పేర్కొన్నారు.ఈనెల ఎడవ తారీకు న నగరంలో జరగనున్న మండే మాదిగల గుండె చప్పుడు, లక్ష డప్పులు కోటి గొంతుకలు కార్యక్రమానికి సన్నాహక సమావేశం శనివారం మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్ లో మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనికి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుండో అనుకూలంగా ఉందని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ వర్గీకరణ నిర్వహించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.వచ్చే శుక్రవారం జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి ,తూము వేణు, ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, రఘు, తూము సంతోష్ , చున్నుపాష, శివ చౌదరి, అశోక్ ,నయీమ్, మోసిన్, సచిన్ ,బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు