వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు…
పాపన్నపేట. నవంబర్. 14 (జనంన్యూస్)
పాపన్నపేట… చాచా గారికి రోజా ఇష్టం పిల్లలందరికీ చాచా ఇష్టమని అందుకే నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామని శ్రీవిద్య పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా అన్నారు… శుక్రవారం నాడు మండల కేంద్రమైన పాపన్నపేట లోని శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం జరుపుకున్నారు.. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక పైన చిన్నారులు డాన్సులు చేస్తూ అబ్బురపరిచారు… వివిధ పాటల పైన చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.. చిన్నారులు చేసిన డ్యాన్సులను చూసి అభినందించారు.. ప్రీ ప్రైమరీ దశలోనే అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం హర్షదగ్గ విషయమని తల్లిదండ్రులు అన్నారు.. అబాకస్ ట్రైనర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ అబాకస్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోని జాతీయస్థాయిలో ర్యాంకు సాధించి పాపన్నపేట మండలానికి పేరు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నిటలా క్ష్యప్ప .. సుమన్. ఉపాధ్యాయులు జ్యోతి రాజ్. విలాస్. షీలా.. అపూర్వ. పల్లవి. అనురాధ. అశ్విని. దుర్గ. విజయ. ప్రియాంక. గౌతమి.. నిర్మల. సునీత. స్రవంతి. కృష్ణవేణి. రేణుక సుజాత వనజ .వసుంధర. ఇందిరా .కృష్ణ. పి ఈ టి ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు..



