Listen to this article

జనం న్యూస్ నవంబర్ 14 మునగాల

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ను గెలిపించాయని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు.మునగాల మండల కేంద్రంలో స్థానిక గణపవరం ఫ్లైఓవర్ ఆవరణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్,అమరగాని మట్టయ్య,కాలే సామిల్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జిలేపల్లి వెంకటేశ్వర్లు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి, మునగాల గ్రామ శాఖ అధ్యక్షుడు ఈదర్ రావు, చింతకాయల నాగరాజు,పాష కోట ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.