Listen to this article

జనం న్యూస్ , నవంబర్ 14( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి)

ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన “చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం” ప్రచారం శుక్ర వారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొని, యువతను డ్రగ్స్‌ ప్రమాదాల నుండి రక్షించేందుకు సమాజం మొత్తం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని స్పష్టంచేశారు.“డ్రగ్స్‌ సమస్య కేవలం పోలీసులదేం కాదు సమాజం భాగస్వామ్యం ముఖ్యం” జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సభలో మాట్లాడుతూ “డ్రగ్స్‌ అనే ప్రమాదం ప్రతి ఇంటిని బెదిరిస్తోంది. ఈ సమస్యను ఓడించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు — అందరూ కలిసే ముందుకు రావాలి.” అని పేర్కొన్నారు.విద్యార్థులు భవిష్యత్ పునాదులు కావడంతో వారికి సరైన మార్గదర్శకత ఇవ్వడం అత్యంత అవసరమని కలెక్టర్ హైలైట్ చేశారు. యువతలో చిన్న పొరపాటు కూడా జీవితాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తుందో ప్రస్తుత ఘటనలు చెబుతున్నాయని, డ్రగ్స్‌ నుంచి దూరంగా ఉండే నైపుణ్యం, ధైర్యం పెంచుకోవాలని సూచించారు. “డ్రగ్స్‌ను వాడేవాడు బాధితుడే కాక, నేరస్థుడిగా మారే అవకాశం ఉంటుంది” జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ తన ప్రసంగంలో “డ్రగ్స్‌ వాడకం యువత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు… జీవితాన్ని నేరాల బారిన పడేలా చేస్తుంది. ఒక తప్పు నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుంది.”
అని విద్యార్థులకు హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సక్రమ మాదకద్రవ్య నియంత్రణ చర్యలు చేపడుతున్నారనీ, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను కఠినంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. యువతలో చైతన్యం పెంపే డ్రగ్స్‌ రాకెట్లను అరికట్టే ప్రధాన ఆయుధమని ఎస్పీ పేర్కొన్నారు.
కాలేజీల్లో ఎస్సై రవికుమార్ అవగాహన కార్యక్రమాలు ప్రశంసనీయము చుంచుపల్లి ఎస్సై రవికుమార్ గత కొన్ని రోజులుగా డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో నిర్వహించిన అవగాహన సదస్సులను జిల్లా అధికారులు అభినందించారు. ఎస్సై విద్యార్థులకు “డ్రగ్‌ స్టైల్ కాదు… నిశ్శబ్దంగా నాశనం చేసే శత్రువు”అంటూ ముక్తకంఠంతో తెలిపారు.తప్పు దారిలో నడుస్తున్న స్నేహితులను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాజం రక్షకుడిగా ప్రతి యువకుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల స్పందన ఉత్సాహంగా సదస్సుకు హాజరైన విద్యార్థులు అనేక సందేహాలను వ్యక్తం చేసి, అధికారులు వాటికి ప్రత్యక్ష సమాధానాలు ఇచ్చారు. డ్రగ్స్‌ ప్రమాదాలపై ఇంత విపులమైన సమాచారం తమకు మొదటిసారిగా లభించిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.