జనం న్యూస్ నవంబర్ 15 అమలాపురం
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన సందర్భంగా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ లో 202 సీట్లలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం చాలా ఆనందకరమైన విషయం అని, ఇది ప్రజా విజయం అని అన్నారు. దేశం లో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని బీహార్ ఎన్నికలతో మరోసారి రుజువైందని అన్నారు. దేశాభివృద్ది,ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా పాలనచేస్తూ అగ్రరాజ్యాలకు పోటీపడుతూ 4 వ స్దానంలో భారత్ ఉండడం మోదీ పాలన వల్లేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు అయ్యల భాష, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ , జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శిలు రమా వర్మ, మోకా ఆదిలక్ష్మి, సాద్విక్, గోకరకొండ గంగన్న స్వామి, అరిగెల నాని, కొండేటి ఈశ్వర్ గౌడ్, జగతా శాంతి, సంసాని రత్నకుమార్, బండి శ్రీను, డీవీఎస్ రాజు, పావులూరి వెంకట్, బొచ్చు ప్రభాకర్, దాకే వెంకటరావు, జంగా రాజేంద్ర కుమార్, చెరుకూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



