

జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నాడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, అధికారులతో కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్మశాన వాటికలను పరిశీలించారు.. ముందుగా పర్వత్ నగర్ హిందూ స్మశాన వాటిక, ముస్లిం స్మశాన వాటిక, రామారావు నగర్ హిందూ స్మశాన వాటిక, ముస్లిమ్స్ స్మశాన వాటిక, పండిత్ నెహ్రూ నగర్ ముస్లిమ్స్ స్మశాన వాటిక, రాజీవ్ గాంధీ నగర్ ముస్లిం స్మశాన వాటిక, క్రిస్టియన్స్ స్మశాన వాటిక, హిందూ స్మశాన వాటిక, యూసుఫ్ నగర్ హిందూ స్మశాన వాటిక పరిశిలించి, యం.ఎల్.ఎ మాట్లాడుతూ అన్ని స్మశాన వాటికలలో ముఖ్యముగా నీటి సమస్య తీవ్రముగా ఉంది అలాగే స్మశాన వాటిక లలో విద్యుత్ దీపాలు మరియు కాలనిలో మంచినీటి సరఫరా సక్రమంగా లేదని స్థానికుల ఫిర్యాదు మేరకు జలమండలి అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన వాటికలలో నీటి సదుపాయం కొరకు బోర్ వెల్స్ వేయించి విద్యుత్ దీపాలు ఏర్పాటు అలాగే అధునాతన వసతులతో కూడుకున్నటువంటి అభివృద్ధి చేయాలనీ ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు, జలమండలి అధికారులు, శానిటేషన్ అధికారులు, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, జాహిద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, టిఆర్ఎస్ రాజు, బ్రహ్మ, సయ్యద్ రియాజ్, రాంబాబు, మల్లేష్, సయ్యద్ నజీర్, మోయిన్, అబ్దుల్ హమీద్, చాంద్ సాబ్, అస్లాం, సలావుద్దీన్, షేక్ సలావుద్దీన్, షేక్ ఇస్మాయిల్, బొల్లు శ్రీనివాసరావు, స్వామి పాస్టర్, రవీందర్ రెడ్డి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.