జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ధర్మపురి ప్రాంతంలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ తో నేడు బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ధర్మపురి పరిసర గ్రామాల నుండి సుమారు రెండు వందల మంది బాలబాలికలు వచ్చి పాల్గొన్నారు. అనంతరం కేకు కటింగ్ చేసి చిన్నారులకు స్వయంగా కేకు అందించారు.పిల్లలతో సందడి నిండిన ఈ వేడుకల్లో వినోద కార్యక్రమాలు, ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పాల్గొన్న ప్రతి పిల్లవాడికి పుస్తకంలు , పెన్సిల్స్, కామ్సెస్ బాక్స్లు, స్కేల్ లు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, క్రమ శిక్షణ తో పెరిగే నేటి బాలలే రేపటి సమాజానికి మంచి పౌరులు అవుతారన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం బాలల పాత్ర ఎంతో కీలకం అన్నారు.బాలల హక్కులు, వారి భవిష్యత్తు నిర్మాణంలో విద్య ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం చివరిలో బాలబాలికలకు ఫలహారం స్వయంగా పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


