Listen to this article

జనం న్యూస్ 15 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా

జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఈ రోజు రాజోలి మండల కేంద్రమైన బాలల దినోత్సవం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత రాజోలి మండల అధ్యక్షులు హోటల్ శివరామయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు చేతుల మీదుగా కొత్త రాజోలి గ్రామంలో న్యూ ప్లాట్స్ పాఠశాల విద్యార్థులందరికీ బ్యాగుల పంపిణీ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనపర్తి రాయచూర్ షాద్నగర్ జోగులాంబ గద్వాల కర్నూల్ జిల్లాల నుండి మెగాస్టార్ చిరంజీవి జిల్లా అధ్యక్షులు హాజరు కావడం జరిగింది అలాగే రాజోలి మండల గ్రామాల నుండి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తూ విద్యార్థులతో కేక్ కటింగ్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వామి నాయుడు మాట్లాడుతూ ఇక్కడ రాజోలి గ్రామంలో ప్రజలు కానీ యువత గాని అలాగే చిరంజీవి అభిమానులు కానీ కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం నాకు ఎంతో సంతోషం కలిగిందని అలాగే ఈ గ్రామానికి నా వంతుగా ఇక్కడ ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కోరిక మేరకు ప్రజలకు సంబంధించిన చిరంజీవి గుర్తింపు కొరకు చిరంజీవి పేరుతో పేదల కళ్యాణమండపం నిర్మిస్తామని అలాగే పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించి విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అలాగే చిరంజీవి ఫ్యాన్స్ శివరామయ్య చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నా దృష్టికి పడటంతో ఎట్లైనా సరే రాజోలి గ్రామానికి వెళ్లి అతనిని కలిసి ఆ గ్రామానికి భవిష్యత్ తరాలకు గుర్తిండి పోయేగా ఏదైనా మంచి పని చేయాలని మనసులో నిర్ణయం తీసుకొని ఈ గ్రామానికి రావడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఎంతో ఆనందం పరిచే విధంగా ఎంతోమంది అభిమానులు సామాజిక సేవ చేసే యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉత్సాహపరిచినట్లు అయిందని తెలుపుతూ శివరామయ్య కుటుంబానికి ఎప్పుడు నా అండదండలు ఉంటాయని సభ ముఖంగా ప్రత్యేకంగా తెలియజేశారు..ఈ కార్యక్రమం పాల్గొన్న అధికారులు స్వామి నాయుడు మాటలు విని మన గ్రామానికి భవిష్యత్తులో మంచి జరుగుతుందంటే మేము కూడా మా వంతు సహాయ సహకారం అందిస్తాము చిరంజీవి సేవలు ఎంతో గొప్పవి మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో మా రాజోలి గ్రామానికి రావడం మా అందరికీ సంతోషం కలిగిందని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు చిరంజీవి ఫ్యాన్స్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు జమ్మన్న,జిల్లా ఉపాధ్యక్షులు రఘు, మండల ఉపాధ్యక్షులు రాము,జడ్పీ జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు యండీ నిషాక్, చిరంజీవి గ్రామ మండల అభిమానులు బుట్ట మౌలాలి,వహీద్,దినేష్,జి వీరేష్, అలవాల శాంతయ్య, చేనేత సేవాసమితి ఎన్జీవో వీరేష్, ఇతర జిల్లాల చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు, మరియు గ్రామ,మండల చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది