Listen to this article

జనం న్యూస్- జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, విద్యార్థులు హరిదాసు, సాంప్రదాయ వేషధారణలో అలరించారు, ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి డైరెక్టర్ హేమలత బహుమతులు అందజేశారు, డైరెక్టర్ హృదయ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మరవకూడదని, విద్యార్థులు చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ ప్రిన్సిపల్ జానీస్ ,డైరెక్టర్ హృదయ రాజు, టీచర్స్ ఉపేంద్ర ,వరలక్ష్మి ,సుజాత, రాధా, అరుణ, ఝాన్సీ, ఇందిర, అనూష ,ఉష, రూతు, హసీన, రోజా రాణి, ఝాన్సీ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.