Listen to this article

జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు

జనం న్యూస్,నవంబర్ 17,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో 18-20 తేదీలలో జరగనున్న విద్యా వైజ్ఞానిక సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు.ఈ తక్షిల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర మంత్రులు,పార్లమెంట్ సభ్యులు,శాసన సభ్యులు,జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొని సైన్స్ పేయర్ ను ప్రారంభిస్తారని తెలిపారు.నారాయణ ఖేడ్ లో ఏర్పాటుచేసిన ఈ సైన్స్ పేయర్ లో ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, మార్గదర్శకులైన ఉపాధ్యాయులు, పాల్గొంటారని అన్నారు. 18వ తేదీ న సాయంత్రం5 గంటలకు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.19, 20,తేదీ న వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఈ విజ్ఞాన సదస్సులో ఏడు విభాగాలలో దాదాపు 700 విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయన్నారు.మన జిల్లా నుంచి ఈ సదస్సుకు ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరచాలని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు,తమ తమ ఉత్తమ ప్రదర్శనలు తీసుకొస్తారని అన్నారు. ప్రదర్శనలను ప్రత్యేకంగా మూడు రోజులపాటు అందరికీ తిలకించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును విద్యార్థులు హాజరై,ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, డి సి ఈ బి సెక్రటరీ లింబాద్రి,ఎంఈఓ లు, విశ్వనాథ్,మన్మధ కిశోర్ నాగారం శ్రీనివాస్ రాములు,రాజశేఖర్ , పిజిహెచ్ఎంలు నర్సింలు,పండరి, గోపాల్,యాదవ్ రెడ్డి, సైన్స్ ఫెయిర్ మీడియా ఇంచార్జ్ భాస్కర్, చంద్రశేఖర్ఆచార్య, రమేష్,నాగనాథ్,వివిధ విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.