జనం న్యూస్ 17 నవంబర్( కొత్తగూడెం నియోజకవర్గం )
సింగరేణి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ & మణుగూరు ఏరియా డీజీఎం పర్సనల్ శ్రీ ఎస్. రమేష్ ఆదేశాల మేరకు సింగరేణి హై స్కూల్ పివి కాలనీ నందు రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆర్.కళ్యాణి ఆధ్వర్యంలో , సింగరేణి ఏరియా హాస్పిటల్ మణుగూరు వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ నాగజ్యోతి తొలుత రక్త వర్గాల గురించి వివరిస్తూ , విద్యార్థినీ విద్యార్థులకు రక్త వర్గాల పరీక్షలు నిర్వహిస్తూ, విద్యార్థులు తామే స్వతంత్రంగా రక్తావర్గాలను నిర్ధారించే విధంగా ప్రోత్సహించారు. కళాశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ కళ్యాణి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించడం ఆనందించ దగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు ఎం.వేణు , జీవశాస్త్ర ఉపాధ్యాయులు లింగంపల్లి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.



