ఐకమత్యంతో జీవిస్తూ ప్రతి ఒక్కరూ సంఘీయుల అభివృద్ధికి పాటుపడాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం నుంచి ఆదివారం శ్రీ కోనసీమ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు.జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సంఘీయులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు1987లో క్షత్రియ పరిషత్ ను ఏర్పాటు చేసినట్టు సభకు అధ్యక్షత వహించిన దాట్ల సత్యనారాయణరాజు తెలిపారు.సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబురాజు తెలిపారు. పెన్మెత్స జగ్గప్పరాజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయిన కార్యక్రమంలో నాయకులు సయ్యపరాజు సత్తిబాబురాజు,పొత్తూరి వెంకటపతిరాజు,వేటుకూరి ప్రసాదరాజు, పెన్మత్స చిట్టిరాజు,దాట్ల బాబు, పాకలపాటి చంటిరాజు,జంపన సత్తిబాబురాజు తదితరులు పాల్గొన్నారు…


