జనం న్యూస్ నవంబరు 16 ( కాట్రేనికోన ) ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
నిత్యకల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి శనివారం భక్తుడు విరాళం అందించారు. ఐ . పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన గోకవరపు రామకృష్ణ దంపతులు రు 10,116 (పదివేల నూట పదహార్లు) శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి అందజేశారు. ఈసందర్భంగా దాత కు అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. శేష వస్త్రం, స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. దాతను చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహాణాధికారి వి సత్యనారాయణ అభినందించారు.


